ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
– పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
– ఎంపిడిఓ , తహసీల్దార్

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి :గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి మండలం లోని బోజన్నపేట గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపిడిఓ రాజు, తహశీల్దార్ శ్రీనివాస్ లు ముఖ్య అతిధులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…… ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టూ పక్కల శుభ్రతగా ఉంచుకోవాలని సూచించారు.   ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపిడిఓ రాజు, తహశీల్దార్ శ్రీనివాస్ లు అన్నారు. గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం ఉంటుందని , ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా కూరగాయలు పండిస్తారని వాటిని తినడం ద్వారా సంపూర్ణ ఆహారం దొరుకుతుందన్నారు.ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిమ ఆసుపత్రి నుండి వచ్చిన ప్రత్యేక అతిధి వైద్యులు కార్తీక్ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వివిధ రకాల ఆరోగ్య పరిస్థితులపై వివరించారు. నేటి పరిస్థితుల్లో నాణ్యమైన ఆహారం తీసుకోవాలని , ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ మేకల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ సుదర్శన్,ఎంపీటీసీ మేకల రాజేశ్వరి-శ్రీనివాస్, పల్లె దవాఖాన వైద్యురాలు సృజన, ప్రతిమ ఆసుపత్రి మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ రాజేందర్, ప్రతిమ ఫౌండేషన్ మేనేజర్ గీత రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభారాణి, పెద్దపల్లి , మంథని మండల కో ఆర్డినేటర్ లు శివ,మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి రమేష్, అంగన్వాడీ టీచర్ విజయ, మహిళ సంఘాల వి ఓ ఏ లు , గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.