అగ్నిధారన్యూస్ జగిత్యాల మేడిపెల్లి మం. పోరుమల్ల గ్రామానికి చెందిన కటకం కృష్ణహరి రాజమణి దంపతులకు ఇద్దరు కుమారులు., బతుకుదెరువు నిమిత్తం జగిత్యాల పట్టణంలో స్థిరపడ్డారు., రాహుల్ ఈ నెల 19వ తేదీన మళ్ళీ వస్తానని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళాడు నాలుగు రోజులైనా తిరిగిరకపోవడంతో తెలిసిన వాళ్ళ దగ్గర బంధువుల ఇంట్లో వెతకగా ప్రయోజనం లేకపోయింది. చివరికి 22వ తేదీన జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ రోజు ఉదయం మల్యాల మం. నూకపెల్లి కెనాల్‌లో గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యం కావడం తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోరుమల్ల కు చెందిన రాహుల్ గా నిర్ధారించి అతని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తల్లిదండ్రులకు తీరని మనోవేదన నాడు అన్న.. నేడు తమ్ముడు
మృతుడు రాహుల్ కు అన్న అయిన రంజిత్(29) కూడా గత ఏడాది మే నెలలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాసటగా నిలుస్తాడనుకున్న ఉన్న ఒక్క కొడుకు కూడా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు ఒంటరి వారయ్యారు. చేతికి అందొచ్చిన కొడుకులు ఇద్దరు ఇలా మధ్యలోనే తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగారు. నువ్వు కూడా అన్న దగ్గరకే వెళ్లిపోయావా తలకొరివి పెడతారనుకున్న కొడుకులకు తండ్రే తలకొరివి పెట్టాల్సి వస్తుందని ఆ తల్లి రోధించిన తీరు అందరినీ కలచివేసింది. అందరితో కలివిడిగా ఉండే అన్నదమ్ములు ఇద్దరు చనిపోవడంతో చేసుకోవడంతో పోరుమల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
