■ టిఆర్ఎస్ నాయకులు ,భాను ప్రసాద్ రావు సన్నిహితుడు, పెగడ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా MLC జన్మదిన వేడుకలు.
■ ఆనందోత్సవాల మధ్య ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు నిర్వహించిన అభిమానులు
అగ్నిధారన్యూస్( హైదరాబాద్ ): కరీంనగర్ సంస్థల ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు 52వ పుట్టినరోజు వేడుకలు పెద్దపల్లి కి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, పెద్దపల్లి అఖిల భారత యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, భాను ప్రసాద్ రావు కి అత్యంత సన్నిహితుడు, పెగడ రమేష్ యాదవ్, మంగళవారం రోజున ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావును హైదరాబాదులో తన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు వ్యక్తం చేశారు. అనంతరం ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .
ఈ సందర్భంగా పెగడ రమేష్ యాదవ్ మాట్లాడుతూ…., నేను అమితంగా ఇష్టపడే భాను ప్రసాద్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. నిత్యం ప్రజా సమస్యల పైన స్పందించే నాయకుడు భాను ప్రసాద్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగి నట్లయితే మంత్రి పదవిని చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేకల విజయ్ కుమార్ , ఈదునూరి.విజయ్ , గుడేవేన గణేష్ తదితరులు పాల్గొన్నారు.
