అగ్నిధార న్యూస్ ,మంథని:

*పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రక్తదానం చేసిన పోలీసులు మరియు యువకులు*

*ముత్తారం : పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్బంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పెద్దపెల్లి జిల్లా లోని గోదావరిఖని లో గల ఆర్ సి ఓ క్లబ్ లో కమిషనరేట్ ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్ మరియు గోదావరిఖని సబ్ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముత్తారం మండలం లోని పలువురు యువకులు మరియు పోలీసు అధికారులు కలిసి రక్తదానం చేశారు.
అన్ని దానాలలో కెల్లా రక్తదానం మహా గొప్పదని, ఈ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ముత్తారం మండల ఎస్సై రాములు కృతజ్ఞతలు తెలిపారు