■ సమావేశంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్
■ విజయవంతంగా కొనసాగుతున్న టి డబ్ల్యూ జే ఎఫ్ మూడవ మహాసభలు
■ జర్నలిస్టుల హక్కులు సాధించుటే మన ద్యేయం
■ హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షతన కొనసాగుతున్న టి డబ్ల్యూ జె ఎఫ్ మహాసభ
అగ్నిధారన్యూస్ ( జమ్మికుంట ) కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేంద్రంలో చాణిక్య డిగ్రీ కాలేజీలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తృతీయ మహాసభలు హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షతన ప్రారంభమైన మహాసభలో ఈ సమావేశంలో జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల జర్నలిస్ట్ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ …..ప్రభుత్వానికి ,పాత్రికేయులకు అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి అన్నారు. జర్నలిజం అనేది గొప్ప వృత్తి అన్నారు. జర్నలిస్టుల పట్ల కెసిఆర్ కి టిఆర్ఎస్ ప్రభుత్వానికి అపారమైన ప్రేమ నమ్మకం ఉంటాయి అన్నారు. నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటా అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛ అందించారు.

