అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) అందుల పల్లి శివారులో స్కార్పియో దగ్ధం అయినా విషయమై బసంత్ నగర్ ఎస్ఐ మహేందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం. పాలకుర్తి మండలం జీడి నగర్ బి.సి కాలనీ నివాసి అర్జున్ (అలియాస్ – ఆపిల్) – అనూష ప్రేమ వివాహం చేసుకున్నారని. ఇరువురి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్న క్రమంలో అనూష మనస్తాపంతో పుట్టింటికి వెళ్లడంతో, (ఆపిల్) సైకో గా మారి వాహనానికి నిప్పు అంటి పెట్టాడని తెలిపారు.
వివరాలుఈ విధంగా ఉన్నాయి
పెద్దపల్లి మండలం అందుగుల పల్లి గ్రామ శివారులో ఎల్లమ్మ టెంపుల్ సమీపాన స్కార్పియో వాహనానికి యజమాని నిప్పంటించి వీరంగం సృష్టించాడు.పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై స్కార్పియో దగ్ధం అవ్వడం చూసి అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు చెందారు. రాజీవ్ రహదారి పక్కన దగ్ధం అవుతున్న స్కార్పియన్ చూసి అటుగా వెళుతున్న వాహనదారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో. ఘటనా స్థలానికి చేరుకుని పోలీస్, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.
