నియామక పత్రం అందించిన డిసిసి అధ్యక్షులు ఈర్ల కొమురయ్య పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్
పార్టీ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తా శ్రీనివాస్ యాదవ్
కార్యక్రమంలో పాల్గొన్న మండల కిసాన్ సెల్ అధ్యక్షులు నెత్తెట్ల కుమార్ యాదవ్
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడుగా నాంసాని శ్రీనివాస్ యాదవ్ ను నియమించినట్లు పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు భూషనవేన సురేష్ గౌడ్ తెలిపారు.జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అద్యక్షులు ఈర్ల కొమురయ్య, సురేష్ గౌడ్ శుక్రవారం నియామక పత్రం అందించారు.ఈసందర్బంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఈ పదవిని ఇచ్చినందుకు రాబోయే రోజుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు,జిల్లా అధ్యక్షులు కొమరయ్య,మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి మండల కిసాన్ సెల్ అధ్యక్షులు నెత్తెట్ల కుమార్ యాదవ్,యువజన కాంగ్రెస్ పెద్దపల్లి అసెంబ్లీ అధ్యక్షులు పూదరి చంద్రశేఖర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.
