అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో  రాత్రివేళ పక్కనే ఉన్న గంగా ప్రవాహం ఉదృతం కావడం చేత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గంగా ప్రవాహం ఉదయం నుండి ఉదృతం కావడం చేత గంగ నీరు గ్రామానికి తాగడానికి ఏ క్షణమైనా పట్టొచ్చని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం వచ్చి సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా లేకుండా గ్రామాన్ని చుట్టూ నీరు ఆవరించి ఉండటంతో మంథనికి  ఖానాపూర్ కు రాకపోకలు స్తంభించిపోయాయి. మంథని ఎస్ ఐ వెంకటేశ్వర్లు తాసిల్దార్ బండి ప్రకాష్ సూచనల మేరకు సర్పంచ్ పుట్ట వెంకటమ్మ రామయ్య సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు గ్రామంలోని 20 నుండి 30 కుటుంబాలను పక్కనే ఉన్న బిట్పల్లి ప్రాంతానికి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్, రైతు వేదికలలో, ఫంక్షన్ హాల్స్ లో, ప్రజలను సురక్షితంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టారు. గ్రామంలోని ప్రజలను విడుదలవారీగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఖానాపూర్ గ్రామస్తుడు మహేందర్ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితిని చూసి ఉండలేదని ఆందోళన వ్యక్తం చేశారు.