అగ్నిధారన్యూస్( మంచిర్యాల)తెలంగాణ నిర్మాణంలో భాగంగా మహాత్మ జ్యోతి పూలే చత్రపతి షాహుజీ మహారాజ్ బాబా సాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ మరియు కాన్షిరామ్ సాహెబ్ గారి బహుజన హితాయ బహుజన సుఖాయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ మరియు మంచిర్యాల జిల్లా ఇన్చార్జ్ గా, భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్ పార్నంది రమేష్ ను నియమిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నా మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో మరియు నిజాయితీతో నెరవేరుస్తానని నూతనంగా ఎన్నికైన పార్నంది రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.తనకు సహకరించిన అందరికీ మరియు ముఖ్యంగా తనకు నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.