అగ్నిధారన్యూస్ నస్పూర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో వి ఆర్ ఏ లు గత యాబై రోజులుగా నిరహార దీక్షలు చేస్తున్నారు.28 మంది ఉద్యోగులు మరణించారు. అయినా కానీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించకోవడం లేదని ఛలో అసెంబ్లీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లాలోని భీమారాం, చెన్నూర్ మండలంలోని గ్రామ రెవెన్యూ సహాయకులు బయలు దేరి అసెంబ్లీ కి వెళ్తుండగా పెద్ద పెల్లి జిల్లా గోదావిఖనిలో పోలీసులు అరెస్ట్ చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఉంచారు.
