అగ్నిధారన్యూస్ ( మాడ్గుల ) ఇటీవల ఇబ్రహీం పట్నం లో కుటుంభ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన మాడ్గుల మండలం నర్సాయిపల్లి కి చెందిన నర్సింగ్ మమత కుటుంబానికి శనివారం మాడుగుల గౌడ కుటుంభ సభ్యుల ద్వారా సేకరించిన విరాళాలు 1,11,110/- రూపాయలను వారీ ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 55,555 రూపాయలను ఫిక్సిడు డిపాసిట్ చేసి దానికి సంబంధించిన బాండ్ ను నర్సాయ పల్లి గ్రామంలో ఇంటి వద్ద అందజేయడం జరిగినది. ఉడుతల శ్రీనివాసులు గౌడ్, ఆప్పారెడ్డి పల్లి నవోదయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మమత ఇద్దరు కుమారులలో ఒకరికి తన పాఠశాల లో ఉచిత విద్యను అందిస్తానని చెప్పడం జరిగినది.
ఈ కార్యక్రమంలో యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, గౌనీ లాలయ్య గౌడ్, కొత్త పాండు గౌడ్, గౌనీ నర్సింహ గౌడ్, మట్ట వెంకటేష్, గజ్జ వెంకటేష్, కారింగు దానయ్య గౌడ్, పాలకుర్ల రాజు, కేశమొని శ్రీనివాస్ ,బాలయ్య గౌడ్,నందీశ్వరు గౌడ్,అశోక్, పబ్బు శ్రీనివాస్ ,గణేష్ గౌడ్,మట్టపల్లి రమేష్,సైదులు,సత్యం,గౌడ సోదరులు పాల్గొన్నారు.
