***అగ్నిధార స్పెషల్ రిపోర్ట్***

■  ఆసరా ఫౌండేషన్ తో ప్రజలకు దగ్గర.           

■  ఎమ్మెల్యేగా పోటీ కొరకె గ్రౌండ్ వర్క్ ?.

 ■  వేటుపడేనా వెనుకకు తగ్గేనా ?.

■  సంజాయిషి కోరిన జిల్లా అధ్యక్షులు.

■  తప్పు చేయలేదంటున్న పెంటరాజేష్.                

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీలో లో కలకలం సృష్టించబోతున్న సస్పెన్షన్ వెయిట్ ? వివరాలకు వెళితే పెద్దపల్లి జిల్లా రామగుండం  కార్పొరేషన్ 37వ డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేష్ పైన పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు ? చేసినట్లు విశ్వసినీయ సమాచారం. జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన పెంట రాజేష్ మున్నూరు కాపు వర్గానికి చెందిన బీసీ నాయకుడు 1992లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి, .తెలంగాణ ఉద్యమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ వెంట  నేటి వరకు  ఉండి రామగుండం కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు. 2003లో ఆసరా అనే స్వచ్ఛంద సేవ సంస్థను ఏర్పాటు చేసి రామగుండం ప్రాంతంలో పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టాడు. అందులో భాగంగా సామాజిక సేవ కార్యక్రమాలను పెద్దపల్లి నియోజకవర్గంలో విస్తరింప చేస్తూ ప్రజలకు దగ్గర కావడానికి  పేదింటి ఆడబిడ్డలకి సామూహిక వివాహాలు, మహిళలకు కోలాట పోటీలు, పొలం బాట కార్యక్రమాలు చేపట్టారు. త్వరలో బంధువై వస్తా అనే కార్యక్రమంతో పెద్దపల్లి నియోజకవర్గంలోని పేదల ఇంటికి  పర్యటించాలనుకునే సమయంలో పెంట రాజేష్ పైన టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వెయిట్ వేసే ఆలోచనలో ఉన్నది అన్నట్టు సమాచారం. పెద్దపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా కార్యక్రమాలను చేపడుతూ పార్టీని ఇరుకున పెట్టే విధంగా  కార్యక్రమాలు ఉన్నాయని ఫిర్యాదు ? మేరకు  పెంట రాజేష్ కి సస్పెన్షన్ తప్పదా అనే ఊహగానాలు బలంగా వినబడుతున్నాయి. ఆ దిశగా పార్టీ చర్యలకు పూనుకున్నట్లు సమాచారం అందుకుగాను, గత రెండు మూడు రోజుల క్రితం పెద్దపల్లి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరు కంటి చందర్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధుకర్, కార్పొరేటర్ పెంట రాజేష్ ని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని తనపై వచ్చిన ఫిర్యాదుకు సంజాయిసి అడిగినట్టు విశ్వాసనీయ సమాచారం.  రాజేష్ మాత్రం తాను పేద ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను తప్ప పార్టీకి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎక్కడ ఇబ్బంది కలిగేలా ప్రవర్తించలేదని సంజాయిషి ఇచ్చినట్లు సమాచారం.