_ విచ్చలవిడిగా నకిలీ నిషేధిత పురుగు మందుల
_100 కంపెనీల వివిధ బ్రాండ్ల పేర్లతో నిషేధిత పురుగు మందులు
_పండించిన పంటను గిట్టుబాటు ధర లేక రైతులు మరింతగా నష్టపోతున్నారు.
నష్టపోతున్న రైతులు
చోద్యం చూస్తున్న వ్యవసాయ అధికారులు
అగ్నిధారన్యూస్, బోథ్:
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు,పురుగు,మందులు లభించడం అనేది గగనమైపోతుంది. విచ్చలవిడిగా నకిలీ నిషేధిత పురుగుమందులు విత్తనాలు ఎరువులు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని నివారించి నాణ్యమైన వాటిని అందించే విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులకు నకిలీ నుంచి భారీగా ముడుపుల అందుతుండడమే ఇందుకు కారణం అని రైతులు చర్చించుకుంటున్నారు.ఫలితంగా దేశానికి వెన్నుముక గా పిలువబడి అన్నదాతల నడ్డి విరిగిపోతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుమందులు మరి ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగించే గడ్డి కలుపు మందులు విక్రయాలకు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి ఇచ్చోడ కూ జోరుగా నకిలీ మందు విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా దాదాపు 100 కంపెనీల వివిధ బ్రాండ్ల పేర్లతో నిషేధిత పురుగు మందులు ఎరువులు విత్తనాలు విక్రయిస్తున్నట్లు వినికిడి.ఏట కోట్లాది రూపాయిల విలువైన నకిలీ మందులు విప్లయిస్తున్నట్లు సమాచారం. ఒక నకిలీ కంపెనీపై విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఈ నకిలీ మాఫియా గుట్టురట్టు అయినా విషయం తెలిసిందే..వ్యవసాయ సాగులో ప్రస్తుతం పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని అయోమయ స్థితిలో నెలకొన్నాయి. ఏపంట సాగు చేసిన సరాసరిన ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి కింద ఖర్చులు చేయాల్సి వస్తుంది. పకృతి పరంగా సహజమైన వైపరీత్యములతో పాటుగా వాతావరణం లో అనుకోని పరిస్థితులు రైతన్నలకు ఎదురవుతున్నాయి.వీటిని అన్నింటిని అధిగమించి పెట్టిన పెట్టుబడులతో పాటు ఆదాయాన్ని పొందాలంటే నిర్ణీత కాలం వరకు పంటలను కాపాడాలి. అందుకున్న ఏకైక మార్గం మందులను పిచికారి చేయడం ఒకటే మార్గం. రైతుల అవగాహన లోపంతో విచ్చలవిడిగా పురుగు మందులను వినియోగిస్తున్నారు. కొందరు వ్యక్తులు కంపెనీలు రైతన్నలు అవసరాలను అజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సొమ్ము చేసుకోవడమే పారపాటిగా మారిపోతుంది. పంటలను కాపాడుకోవాలని.ఆరాటంతో అప్పులు చేసి మరి పురుగుమందుల విక్రయదారులను రైతులు చేస్తున్నారు. తమకు లాభాలు తెచ్చి పెడుతున్న బయోమందులను విక్రయిస్తూ రైతన్నల అజ్ఞానాన్ని అవసరాన్ని ఆధారంగా మలుచుకుంటున్నారు వ్యాపారులు.మార్కెట్లో పేరు మోసిన ఉత్పత్తులకు కొంచెం అటు ఇటుగా పేర్లను ముద్రణావేసి బయో ఉత్పత్తులను ఎటువంటి బిల్లులు లేకుండా… విక్రయిస్తున్నారు. రైతన్నలు పంటను దక్కించుకోవాలని ఆరాటంతో తెలిసి తెలియక వీటిని కొనుగోలు చేసి పంటలకు పిచికారి చేస్తున్నారు. ఇలాంటి ఉత్పత్తులు పంటల పూర్తిస్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో ఒకటి రెండు సార్లు మందులు పిచికారి చేయాల్సిన అవసరం ఏర్పడుతున్న తరణం రైతన్నలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కంపెనీలనుండి ముడి పదార్థాలను కొనుగోలు చేసి అందులో వివిధ రసాయనాలను కలిపి మందుల పేర్లు ఇస్తున్నారు. బోథ్ నియోజకవర్గ వ్యాప్తంగా.ఇచ్చోడ, బోథ్ బజార్ హత్నూర్, గుడి హత్నూర్, నేరాడిగోండ, సిరికొండ, సొనల మండలాలలో కలిపి సీజన్లు కోట్లాది రూపాయలు బయోమందుల వ్యాపారం సాగుతుంది మార్కెట్లోకి వస్తున్న వైనం ధరలు వంటి వివరాల పరిశీలన అధికారుల నిర్లక్ష్యం చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పురుగు మందుల దుకాణదారులు వారికి ఇష్టం వచ్చినట్లు ధరలు ప్రకటించి అమాయక రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు..ఈ వ్యవహారం సంబంధిత అధికారులకు తెలుసని విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకుంటూ తనిఖీలు నిర్వహించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి,పకడ్బందీగా వ్యవహరించి పురుగుమందుల ధరలు నియంత్రణ చేయడమే కాకుండా బయో ఉత్పత్తుల పేరిట సాగుతున్న మోసాన్ని దోపిడీ అడ్డుకట్ట వేయాల్సి ఉంది.
*మోసపోతున్న రైతులు*
ఏవి నాణ్యమైనవి ఏవి నకిలీవి అనేది రైతులు నిర్ధారించలేక పోవడంతో నకిలీ ఎరువులు విత్తనాలు పురుగుమందులతో రైతులు నిలువునా మోసపోతున్నారు. ఓవైపు ఏటా పెరిగిపోతున్న వ్యవసాయ ఖర్చులు మరోవైపు నకిలీ మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల ఖరీఫ్ సీజన్లో దాదాపు రెండు లక్షల ఎకరాలతో రైతులు పత్తి పండిస్తున్నారు. ఎకరానికి 20వేల నుంచి 25వేల రూపాయల వరకు వ్యవసాయానికి వెచ్చించాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో నకిలీ వల్ల వ్యవసాయ ఖర్చు మరింతగా పెరిగిపోతుందని అన్నదాతలు వాపోతున్నారు. అన్నింటినీ తట్టుకో నీ పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు మరింతగా నష్టాల ఫాల అవుతున్నారు. నకిలీ బెడద లేకుండా కష్టించి పండించిన పత్తి మద్దతు ధర లభించిన నాడు మాత్రమే రైతు రాజు అని అంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయశాఖ అధికారులు కళ్ళు తెరిచి నిషేధిత నకిలీ పురుగుమందుల విత్తనాలు ఎరువులు అమ్ముతున్న షాపులపై కొరడా చూపించాలని నకిలీ బెడద నుంచి అన్నదాతలను కాపాడాల్సిన అవసరం ఉంది.
*చోద్యం చూస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు*
అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుల మందుల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్న విషయం బహిరంగ రహస్యం అయినప్పటికీ వ్యవసాయ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోకుండా కల్లప్పగించి చూస్తున్నారన్న విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి. సాధారణంగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రతినెల విత్తనాల ఎరువుల పురుగుమందుల డీలర్లు గోదాం తనిఖీ చేసి నివేదికలను ఉన్నతాధికారులకు పంపాల్సి ఉన్న, నామమాత్రంగా తనిఖీలు చేసి నివేదికలు పంపుతున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
