పాఠశాల ప్రహారి గోడ, కిటికీ పనులు త్వరగా చేపట్టాలి.

మరమ్మత్తుల అనంతరం పాఠశాలకు అంగన్ వాడి కేంద్రం తరలింపు.

ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ.

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా// వీర్లపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యా వ్యవస్థను
విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో పగడ్బందీగా, పటిష్టమైన విద్యా ప్రమాణాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు.
మంగళవారం రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ పరిధి 14వ డివిజన్ లోని వీర్లపల్లిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.
ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ వారి విద్యా ప్రమాణాలపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఆంగ్ల భాషలో అక్షరాలతో వచ్చే పదాలు, వాటి వినియోగం పై కలెక్టర్ విద్యార్థులకు వివరించారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన జిల్లా కలెక్టర్ వారి ఆశయాలను అడిగి తెలుసు కున్నారు.
పాఠశాలకు ప్రతిరోజు వచ్చి ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ, క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, నిర్దేశించుకున్న ఆశయాలను సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు.
అనంతరం పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎన్టిపిసి సి. ఎస్ .ఆర్ నిధుల కింద మంజూరైన ప్రహరీ గోడ, కిటికీల ఏర్పాటు తదితర పనులు వెంటనే చేపట్టి త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రాథమిక పాఠశాల మరమ్మత్తులు పూర్తిచేసి రంగులు వేసిన తర్వాత పాఠశాలలో ఖాళీగా ఉన్న రూంలోకి అంగన్వాడీ కేంద్రాన్ని తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం తహసిల్దార్ కుమార్ స్వామి, పాఠశాల హెడ్మాస్టర్, అంగన్వాడీ టీచర్స్, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.