అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.5 లక్షల50 వేల విలువైన బహుమతులకు గాను లక్కీ డ్రా నిర్వహిస్తోంది. బస్సులో ప్రయాణించిన మహిళలు తమ బస్ టికెట్ లను టికెట్ వెనుకాల పేరు, చిరునామా, సెల్ ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్ లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బాక్స్ లో వేయాలి. సుల్తానాబాద్ లోని బస్టాండ్ లో ఇట్టి లక్కీ డ్రా బాక్స్ ను బుధవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి ప్రయాణించి బస్సు స్టాండ్ లో దిగిన మహిళలు తమ టికెట్ ల వెనుక పేరు, చిరునామా, ఫోన్ నంబర్ రాసి బాక్సులలో వేశారు. మహిళా ప్రయాణికులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని కరీంనగర్ ఆర్టీసీ 2వ డిపో మేనేజర్ మల్లయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బస్టాండ్ కంట్రోలర్ జెపి రావు, స్టాప్ ఖాదర్, సంపత్, స్థానికులు దూడం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.