అగ్నిధార న్యూస్,పాపన్నపేట: పాపన్నపేట మండల కార్యాలయంలో శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని,ఇది ప్రజా ప్రభుత్వమని అన్నారు.కుటుంబ సభ్యుడి వలె సేవ చేస్తానని పేర్కొన్నారు.కాగా కార్యాలయం  నాయకులు,జనంతో కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్ బాబు,ఇంచార్జి ఎంపీడీఓ లక్ష్మికాంత్ రెడ్డి,ఎంపీపీ చందన,ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,కో ఆప్షన్ గౌస్,డిసిసి అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప,ఎంపీటీసీలు అకుల శ్రీనివాస్,రమేష్ గౌడ్, కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి నిటలాక్షప్ప,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్, నాయకులు ప్రశాంత్ రెడ్డి, నరేందర్ గౌడ్,ప్రవీణ్ గౌడ్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.