ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాము.
ప్రజా రంజక పరి పాలన కొనసాగిస్తాం.
అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తాం.
ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:
శుక్రవారం రోజు సాయంత్రం పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో పెద్దపల్లి పట్టణ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు 23 కళ్యాణ లక్ష్మి,17 షాదీ ముబారక్ (40 లక్షల 4వేల 640 రూపాయల) చెక్కులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
రాబోయే రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంతో పాటు, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డబ్బుతో సహా తులం బంగారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను దశలవారీగా అమలు చేయడం జరుగుతుందని, ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేదని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాద్రి రామయ్య సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు రానున్నాయని తెలిపారు. ఇండ్లు లేని పేదలకు ప్రాధాన్యత క్రమంగా ఇల్లు కేటాయించడం జరుగుతుందని, ఇండ్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి, ఎంపీడీవో శ్రీనివాస్ గౌడ్,తహశీల్దార్ రాజ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్ , తూముల సుభాష్, నెతెట్ల కుమార్, అమరేష్, శ్రీకాంత్, ఎంపీటీసీ ఏడెల్లి శంకర్, సందవెని రాజేందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


