పి.జి. ప్రవేశ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ.

జూన్ 23 ఆదివారం ఉదయం 9 నుండి 12-30 వరకు పరీక్ష నిర్వహణ.

పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు.

పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలి.

నేషనల్ ఎలిజిబిలిటి కం ఎంట్రన్స్ టెస్ట్ – పి.జి. ప్రవేశ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్.

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: జూన్-22: 

నేషనల్ ఎలిజిబిలిటి కం ఎంట్రన్స్ టెస్ట్ – పి.జి. ప్రవేశ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ అన్నారు.శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోనీ తన ఛాంబర్ లో నేషనల్ ఎలిజిబిలిటి కం ఎంట్రన్స్ టెస్ట్–పి.జి. ప్రవేశ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ మాట్లాడుతూ,నేషనల్ ఎలిజిబిలిటి కం ఎంట్రన్స్ టెస్ట్ – పి.జి. ప్రవేశ పరీక్ష జూన్ 23న ఉదయం 9 నుండి 12-30వరకు జిల్లాలోనీ మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఇట్టి ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. అభ్యర్థులు వారి హాల్ టికెట్ పైన ఉన్న సూచనలు తూచ తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ సూచించారు.పరీక్షా కేంద్రం వద్ద అవసరమైన భద్రత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థుల తనిఖీ పకడ్బందీగా జరగాలని, పరీక్ష నిర్వహణ సమయంలో ఎటువంటి విద్యుత్తు అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రధమ చికిత్స కిట్లతో వైద్య బృందం నియమించాలని, పరీక్షకు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడిచేలా చూసుకోవాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉదయం 7 గంటల నుండి పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారని, అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని అదనపు కలెక్టర్ సూచించారు.పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్, టాబ్లెట్ , క్యాలిక్యులేటర్, ఇతర గ్యాడ్జెట్స్, రికార్డింగ్ పరికరాలు తీసుకొని రావడానికి అనుమతి లేదని, అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకోవాలని, షూస్ ధరించడానికి అనుమతి లేదని, పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి లాకర్ లు అందుబాటులో ఉండవని, అభ్యర్థులు తమ వెంట సెల్ ఫోన్, ఇతర ముఖ్యమైన పరికరాలను తీసుకొని రావద్దని అదనపు కలెక్టర్ తెలిపారు .ఈ సమావేశంలో మంథని సిఐ , కళాశాల ప్రిన్సిపాల్, ముఖ్య సిబ్బంది, కలెక్టరేట్ ఎగ్జామ్స్ విభాగం సూపరింటెండెంట్ ప్రకాశ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.