అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

జల్సాలకు అలవాటు పడి దొంగతనం చేస్తూ వాహనాల తనిఖీ చేస్తుండగా జల్సాలకు అలవాటు పడిన మధ్యానికి డబ్బులు లేకపోవడంతో దొంగతనానికి పాల్పడిన దొంగను సుల్తానాబాద్ ఎస్సై CH శ్రవణ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే శనివారం సాయంత్రం సుల్తానాబాద్ పట్టణంలోని పుసాల రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా తిరుగుతున్న మడిగుడ్ల విజయ్ కుమార్(40) ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించాడని ఆయన తెలిపారు. విజయ్ కుమార్ స్వగ్రామం సిద్దిపేట మండలం రాఘవ పూర్ గ్రామానికి చెందిన ఆయన గత నెల 29వ తేదీన సుల్తానాబాద్ పట్టణంలోని ఓ బార్ లో దొంగతనం జరిగినట్లు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గతంలో రంగారెడ్డి సిద్దిపేట జీడిమెట్ల కొత్తగూడెం రాయదుర్గం వనస్థలిపురం మహబూబాబాద్ సంగారెడ్డి తోపాటు ఇతర జిల్లాలలో 30 పైగా దొంగతనం కేసులు ఉన్నాయని వివరించారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో మద్యానికి బానిసైన విజయకుమార్ సుల్తానాబాద్ కు మొదటిసారిగా వచ్చి అతిగా మద్యం సేవించి గోడదూకి దొంగతనానికి పాల్పడినట్లుఅతని వద్ద నుంచి పదివేల రూపాయలు రికవరీ చేసి, రిమాండ్ కు తరలించినట్లు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.