రెండు కోళ్లకు రూ, 6,500.
ఒక్క కోడి రూ, 4000.
మరో కోడి రూ, 2500.
అగ్నిధారన్యూస్, కమాన్ పూర్:
కమాన్ పూర్ మండలం కమాన్ పూర్ పోలీసు స్టేషన్ ఆవరణలో మంగళవారం పందెం కోళ్ల వేలం పాట ఎస్. ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలం పాటలో రెండు పందెం కోళ్లకు రూ, 6,500 లు ధర పలికింది. ఇందులో ఒక్క పందెం కోడికి రూ, 4000లు ధరకు కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన పురాణం సారయ్య దక్కించుకున్నారు. అలాగే మరో పందెం కోడిని కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన బోనాల సత్యనారాయణ రూ, 2500 ల ధరకు దక్కించుకున్నారు. ఈ పందెం కోళ్ల వేలం పాటలో వచ్చిన డబ్బులను కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుందని ఎస్ ఐ తెలిపారు. గత నెల 27న కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్ గ్రామ శివారులో కోడి పందాల ఆట ఆడుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఏడుగురు కోడి పందెం రాయుళ్లను పట్టుకుని వారి పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కోర్ట్ ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాట కు దాదాపు 50 మంది వరకు హాజరయ్యారు.
