Oplus_0

అగ్నిధారన్యూస్, ధర్మసాగర్:

ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరిపై ఎదురుగా వచ్చే లారీ ఢీకొనగా బండి పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందిన ఘటన మండలంలోని జానకిపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లి కుదుర్ల గ్రామానికి చెందిన గురజాల మల్లారెడ్డి (60), అతని బామ్మర్ది సారంపల్లి అమరేందర్ రెడ్డి (40) ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై ధర్మసాగర్ వైపు వస్తుండగా జానకిపురం గ్రామం ఎస్సీ కాలనీ వద్ద మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వారికి ఎదురుగా వచ్చే టిప్పర్ డ్రైవర్ అతివేగంతో, ఆ జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా అమరేందర్ రెడ్డి, మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మల్లారెడ్డి కుమారుడు రామారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Oplus_0