నూతన ఇసుక రీచ్ ఆప్రోచ్ రొడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు.
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాలలు, నూతన ఇసుక రీచ్, తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నీరుకుల్లా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం రెగ్యులర్ గా శుభ్రం చేయాలని అన్నారు.గట్టేపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్న్ కూడ పరిశీలించారు. నీరుకుల, గట్టెపల్లి గ్రామాలలో నూతన రోడ్లకు ఇరువైపులా ఎత్తైన మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులకుసూచించారు. ఈ సందర్భంగా మండలంలోని నీరుకుల, గట్టెపల్లి గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ఇసుక రీచ్ లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇసుక రీచ్ లకు అవసరమైన అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సుల్తానాబాద్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ తో పాటు సుల్తానాబాద్ తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సచిన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

