మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి.

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) 

కడ్తాల్ మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి గ్రామపంచాయతీ పరిధిలో నిండుకుండలా ఉన్న మేడికుంటకు గండిపడటంతో భారీగా వర్షం నీరు వృధా అయ్యింది.రైతుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ లక్ష్మి నరసింహ రెడ్డి,బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మేడికుంటను పరిశీలించి జెసిబి సహాయంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వర్షాకాలానికి ముందే గ్రామాలలో ఉన్నటువంటి చెరువులను, కుంటలను ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి భద్రతా చర్యలు చేపడితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని తెలిపారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన మేడికుంట కట్ట పునర్నిర్మాణ చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టాలని కోరారు. గ్రామాలలో ఉన్న చెరువులు కుంటలలో సమృద్ధిగా నీరు నిల్వ ఉంటేనే వ్యవసాయ బావులలో నీరు సమృద్ధిగా ఉంటుందని,గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత పునరుద్ధరణ కార్యక్రమంతో భూగర్భ జలాలు పెరిగిపోయాయని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చెరువు కట్టలపై ఉన్న కంపచెట్ల తొలగింపు కార్యక్రమాలు కూడా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లాయక్ అలీ, మాజీ వార్డు సభ్యులు గురిగళ్ళ జంగమ్మ రామచంద్రయ్య, గ్రామస్తులు గూడెపు జంగయ్య,బీఆర్ఎస్ నాయకులు సిద్ది వెంకటేష్, మూడ రవి, పురుషోత్తం ,గూడెపు మహేష్, కాలే శ్రీను ,కంబాల శ్రీకాంత్, శ్రీశైలం ,ఇరిగేషన్ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ ఎల్లయ్య,కృష్ణ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.