….జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-31:
పెద్దపల్లి జిల్లాలో రాబోయే 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు పెద్దపల్లి జిల్లాలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వీటి వల్ల పెద్ద ఎత్తున వరదలు వచ్చే ప్రమాదం ఉందని , దీనిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అధికారి హెడ్ క్వార్టర్ మైంటైన్ చేయాలని, రోడ్ల పై వరద నీటిని ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు స్థానిక సంస్థ సిబ్బంది క్లియర్ చేయాలని, విద్యుత్ సరఫరా త్రాగునీటి సరఫరా ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
భారీ వరదలు వచ్చే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని నీటి వనరులు అందులోని నీటి నిల్వ పరిస్థితి, చెరువు కట్టలు మొదలవు వాటిని అధికారులు పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
అతి భారీ వర్షాలను నేపథ్యంలో ప్రజలు అధికార యంత్రంగానికి సంపూర్ణంగా సహకరించాలని, 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

