వరద బాధితులకు కోటి విలువైన సహాయ సామాగ్రి
– ఐటి మంత్రి శ్రీధర్ బాబు.
అగ్నిధారన్యూస్ మంథని// హైదరాబాద్
ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీల సంఘం (హైసియా), నిర్మాణ డాట్ ఆర్గ్ సంస్థలు కోటి రూపాయల విలువైన సహాయ సామాగ్రిని అందజేస్తుడం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. వెయ్యి సంచుల సహాయ సామాగ్రితో కూడిన తొలి వాహనాన్ని ఆయన ఆదివారం నాడు సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.బియ్యం, వంట నూనె, చక్కెర, ఉప్మారవ్వ, ఉప్పు, కారం, పసుపు, సబ్బులు, టవల్స్, టూత్ పేస్టు, శానిటరీ ప్యాడ్ లతో కూడిన ఒక్కో కిట్ లో రూ.3 వేల విలువైన సామాగ్రి ఉంటుంది.మరో మూడు వాహనాల సామాగ్రిని రెండు రోజుల్లో పంపిచనున్నట్టు శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ సహాయ, పునరాస కార్యక్రమాలకు తోడుగా ప్రైవేటు సంస్థలు, ఎన్జీవోలు ముందుకు వచ్చి వరద బాధితులకు చేయూతనివ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. వదరల్లో సర్వం కోల్పోయిన వారి పునరావాసానికి కూడా ఈ సంస్థలు సహాయపడాలని శ్రీధర్ బాబు కోరారు. కార్యక్రమంలో హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెండ్ల, మాజీ అధ్యక్షుడు భరణీ కుమార్, నిర్మాణ, ఐఎస్టీ, తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

