*మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్*
అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివాస్ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే, ఈ మేరకు ఇవాళ కడ్తాల్ మండలంలోని గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరేశారు. అనంతరం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిస్తే నేటి కాంగ్రెస్ పాలనలో రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో ఫెయిల్ అయిన సర్కార్ ఏదైనా ఉందంటే అది రేవంత్ సర్కారే అని మండిపడ్డారు. ఇవాళ ఏ వర్గం ప్రజలను అడిగిన మళ్లీ కెసిఆర్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. నాటి ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ చేపట్టిన దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సాధనలో దీక్ష దివాస్ ఎంత ముఖ్య పాత్ర పోషించిందో, నేడు రేవంత్ సర్కార్ ని గద్దె దించేందుకు దీక్ష దివాస్ అంతే ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, మాజీ సర్పంచులు తులసి రామ్ నాయక్, యాదయ్య, హరిచంద్ నాయక్, సులోచన, సాయిలు, శ్వేతాబునాద్, భాగ్యమ్మ, జంగయ్య, మాజీ ఎంపిటిసిలు మంజుల చంద్రమౌళి, మాజీ డైరెక్టర్ లాయక్ అలీ, నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ, జంగయ్య, లక్ష్మణాచారి, నరసింహ, కృష్ణ, వెంకటేష్ ,వినోద్, మహేష్, శ్రీను, అంజి ,జెడిఎన్ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ , యాదయ్య, మల్లేష్, పవన్, జంగయ్య ,రమేష్, సురేష్ ,శ్రీకాంత్ ,సాయి, కృష్ణయ్య, పాండు ,రాజు, గణేష్, లింగం, పవన్, వెంకటయ్య, మహేష్, రాజశేఖర్ ,సుమన్ ,జగన్, సక్రు ,గణేష్, మురళి ,భాస్కర్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.
