జనవరి 10 లోపు ఎంపిడీఓ ప్రాంగణంలోని కార్యాలయం తరలించాలి.
బస్సు డిపో ఏర్పాటుపై భూమి అధికారులతో సమీక్ష.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అగ్నిధారన్యూస్,పెద్దపల్లి , డిసెంబర్-28:
శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బస్సు డిపో ఏర్పాటుకు భూమి అప్పగింతపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జనవరి 10 లోపు పెద్దపల్లి ఎంపిడీఓ ప్రాంగణంలోని కార్యాలయాల తరలింపు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులు ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,
పెద్దపల్లిలో బస్సు డిపో మంజూరైన
నేపథ్యంలో స్థలం అప్పగించేందుకు వీలుగా పెద్దపల్లి ఎంపీడీవో ప్రాంగణంలో ఉన్న కార్యాలయాల తరలింపు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారుల ఆదేశించారు.
పెద్దపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, అబ్కారీ శాఖ కార్యాలయం తరలింపుకు ప్రభుత్వ భవనాలలో అనువైన చోటును ఎంపిక చేసుకోవాలని, అవసరమైతే ప్రైవేటు భవనాలను సైతం ఎంచుకోని, జనవరి 10 లోపు కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఈ.ఈ. పి. ఆర్ .గిరీష్ బాబు, డిఇఓ మాధవి సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

