అగ్నిధారన్యూస్ మంథని :
తన భూమి పట్టా చేస్తానని 10,000 లంచం తీసుకొని పనిచేయకుండా తిప్పించుకుంటున్నాడని ముత్తారం ఆర్ఐ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని మంథని ఆర్డీవోకు తీర్థాల కొమురెల్లి గురువారం ఫిర్యాదు చేశారు. తనకు 9 గంటల వ్యవసాయ భూమి పట్టా చేపిస్తానని పదివేల రూపాయలు లంచం తీసుకొని ఇబ్బందుల గురి చేస్తున్నాడని పట్టా ఎందుకు కావడం లేదని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను అడుగుతే మీరు ఇచ్చిన డబ్బులు పాత తహసిల్దార్ కు ఇచ్చానని తన వద్ద ఆ డబ్బులు లేవని పేర్కొన్నట్లు రైతు తీర్థాల కొమురెల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన వినతిపత్రంలో పేర్కొంటూ.. తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
