Oplus_131072

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ 

లంచగొండి అధికారులు మరోసారీ ఏసీబీ వలలో చిక్కారు. బుధవారం  సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 20వేల రూపాయల లంచంతీసుకుంటుండగా సుల్తానాబాద్ ఎస్సారెస్పీ డివిజన్ సిక్స్ సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ సురేష్ లు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే ..ఇదేకార్యాలయంలో పనిచేస్తున్న ఇజాజ్ సిక్ లీవ్ పెట్టగా అది ధ్రువీకరించేందుకు 20వేల రూపాయలు లంచం అడగ్గా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు దాడులు నిర్వహించి ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలియజేశారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.