జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు పిర్యాదు.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామంలో పీవీసీ ఇటుక బట్టిలో చిన్నపిల్లతో వెట్టిచాకిరీ చేపిస్తున్న యజమాని వెంకన్నపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ కు దళిత బహుజన లేబర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి కైలాసం శుక్రవారం పిర్యాదు చేశారు. బట్టీలో బాలలతో ఎందుకు పని చేయిస్తున్నారని ప్రశ్నించినందుకు నన్ను కులంపేరుతో ధూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని కమీషన్ సభ్యుడికి తెలిపారు. దీనిపై వెంటనే విచారణ జరిపించి  యజమాని లైసెన్స్ రద్దు చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని భాల కార్మి కులకు వెట్టి చాకిరి నుండి విముక్తి కల్పించాలని కోరారు. కమిషన్ సభ్యులు సానుకులంగా స్పందించడం జరిగిందని కైలాసం తెలిపారు. ఆయన వెంట కండె కరుణాకర్, తదితరులు ఉన్నారు.