అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్//పెద్దపల్లి
పెద్దపల్లి, జిల్లా కేంద్రంలో ఆర్టీవో ఆఫీస్ లో గురువారం జరిగిన ఏసీబీ దాడులు మరవకముందే మరోసారి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. వినోద్ విజయ్ బాధితుడి వద్దనుండి 5000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఆర్నకొండ ప్రసాద్ ఇంటి నంబర్ కోసం గత సంవత్సర కాలం నుండి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ… అధికారులు పట్టించుకోకపోగా, గత 15 రోజుల నుండి మున్సిపల్ ఉద్యోగులైన వినోద్, విజయ్ లను కలవగా పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ముందస్తు ఒప్పందం ప్రకారం 5000 రూపాయలు లంచం ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారి డిఎస్పి విజయ్ కుమార్ సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ నిందితుల ఇరువురిని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని తెలిపారు.
