వేల్జాల్ గ్రామంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు.

మార్కెట్ డైరెక్టరు చర్ల వెంకట్ రెడ్డి.

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) తలకొండపల్లి మండలం లోని వేల్జాల్ గ్రామం లో భారతరత్న కీర్తిశేషులు మాజీ ప్రధాని  పివి నరసింహారావు  జయంతి వేడుకలు   మార్కెట్  కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి  ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా  ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఇవాళ అర్పించారు అనంతరం మాట్లాడుతూ,అనుభవం అక్షరాలలో  అధికారంలో ఆలోచన దారిలో శాంతమైన చైతన్యంతో దేశాన్ని నడిపిన ధీరుడు, ఆర్థిక  సంస్కరణల పితామహుడు, బహు భాషా కోవిదుడు పీవీ నరసింహారావు అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపిటిసి  శ్రీనివాస్ మూర్తి, మాజీ ఉప సర్పంచ్ అజీజ్, మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మాజీ సింగల్ విండో డైరెక్టర్  కృష్ణయ్య గౌడ్, నాయకులు  లింగం యాదవ్,కిరణ్ గౌడ్, ఎల్ మల్లేష్, చింతకాయల లక్ష్మణ్, విష్ణు, సయ్యద్ గౌస్, గోవర్ధన్, ఎం.డి నయ్యం,  రవి, ఎస్ లక్ష్మీనారాయణ, గోపాల్ రెడ్డి, రామిరెడ్డి ,  అంజిరెడ్డి, రామచంద్రి, జాజాల నరేష్, ప్రభాకర్, మహమూద్ ,  అంజి,  జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.