అగ్నిధార న్యూస్, కామారెడ్డ:
*ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు*..
ఇందిరా గాంధీ వర్ధంతి పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా లో ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బాన్సువాడ నియోజక వర్గ ఇంచార్జి కాసుల బాలరాజ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడిన మహిళా ఇంద్రగాంధీ అని ఆయన అన్నారు. అలాగే దేశంలోని మొట్ట మొదటి మహిళా ప్రధాని అని, గరీబీ హటావో నినాదంతో మరియు బ్యాంకులను జాతీయం చేయడంలో అంతరీక్షంలో మొట్ట మొదటి ఉపగ్రహాన్ని మనదేశంలో పంపిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ,నాయకులూ ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కొనియాడారు . ఈ కార్యక్రమములో మాజీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు అలీబిన్ అబ్దుల్లా, జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు హన్మాండ్లు ,జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఖలేఖ్ ,మండల అధ్యక్షులు మంత్రి గణేష్ ,పట్టాణ అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి ,పట్టణ కిసాన్ కేత్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,కొయ్యగుట్ట ఉపసర్పంచ్ తారు నాయక్ యస్సి అధ్యక్షులు బిట్టా గంగాధర్,డైరెక్టర్ సాయిలు,షాహబ్ ,సలీం ,కొమ్ము వినోద్ ,చిదుర సంగమేశ్వర్, మరియు కార్యకర్తలు నాయకులూ, తదితరులు పాల్గొన్నారు.
