అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
భారత దేశ మొట్ట మొదటి మహిళా ప్రధాని, భారత రత్న శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సంధర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టి ఆఫిస్ వద్ద ఇందిరా గాంధీ చిత్రపఠానికి ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసినటువంటి సేవలు ఆచరణీయం అనుసరణీయం మరువలేని అన్నారు
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు ఈర్ల కొమురయ్య మాట్లాడుతూ ఇందిరాగాంధీ జీవితం ఆదర్శనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి నాయకులు, బుతాగడ్డ సంపత్,నేతట్ల కుమార్, ,తాండూరి శ్రీమాన్, తూముల సుభాష్,బొడ్డుపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
