అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

*పెద్దపల్లి  కాంగ్రెస్ అధ్వర్యంలో దివంగత నేత భారతరత్న మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీ ఇందిరా గాంధీ గారి వర్ధంతి వేడుకలు*

పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ కమిటీ  అధ్వర్యంలో స్వర్గీయ శ్రీ ఇందిరా గాంధీ గారి వర్ధంతి వేడుకలునిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈర్ల. కొమురయ్య గారు మాజీ ఎమ్మెల్యే సి హెచ్ విజయ రమణ రావు గార్లు హాజరై ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారుఈ సంధర్బంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య మాట్లాడుతూ విప్లవాత్మక సంస్కరణలతో భారత దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన దార్శనికురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారని రోటీ కపడ, ఔర్ మకాన్ వంటి కార్యక్రమాలను ఈ దేశానికి అందించి పేదప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నాయకురాలు ఇందిరా గాంధీ గారని కొనియాడారు ఈ దేశానికి మొట్ట మొదటి మహిళా ప్రధానిగా ఉక్కు మహిళగా బడుగు బలహీనవర్గాలకు “ఇందిరమ్మ” గా పేదవాడికి ఇరవైసూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి ఒక గొప్ప అవకాశాన్ని సృష్టించి వారికీ అండగా ఉండి శత్రుదేశాలకు సైతం నిద్రలేకుండా చేసిన ఘనత ఇందిరా గాంధీ గారికి దక్కుతుందని అన్నారుమాజీ ఎమ్మెల్యే సి హెచ్ విజయ రమణ రావు మాట్లాడుతూ ఈ దేశ ప్రధానిగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం అనీ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు శంకు స్థాపన చేసిన శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఇక్కడిప్రాంత ప్రజలకష్టాలను తీర్చరని అన్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఇందిరా గాంధీ గారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి చంద్ర శేఖర్ నేట్టెట్ల కుమార్ పియస్ విజయ్ కుమార్ తాడురి శ్రీమాన్ తూముల సుభాష్ బుతగడ్డ సంపత్ రంగు ప్రభాకర్ కొదాది ప్రశాంత్  సురేష్ గౌడ్ తది తరులు పాల్గోన్నారు