అగ్నిధార న్యూస్ చిన్నంబావి మండలం. తెలంగాణ మార్కుఫెడ్ వనపర్తి ఆధ్వర్యంలో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొప్పునూర్ ద్వారా మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయుటకు అనుమతి లభించింది.రైతులు ప్రభుత్వ నిర్దేశించిన మద్దతు ధర 2400రూపాయలు. క్వింటాల్‌కు తమ మొక్కజొన్నను విక్రయించుకునే సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.ఈ కేంద్రం త్వరలో ప్రారంభం కానుంది, రైతులు తమ పంటను సమయానికి తీసుకురావాలని, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించడమైనది.  ఈ కార్యక్రమంలోచైర్మన్ బగ్గారి నర్సింహారెడ్డి. సీఈఓ నాగరాజ్. డైరెక్టర్లు శ్రీకాంత్ రెడ్డి. శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.