విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం,
ఇటుక బట్టి యజమాని అలసత్వం.
నిండు ప్రాణాన్ని బలిగొన్న వైనం..
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి,
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని ఎమ్మెస్సార్ ఇటుక బట్టీ సమీపంలో గొర్ల కాపరి దాగటి మల్లేష్ (40 )విద్యుత్ షాక్ తో మృతి.గౌరెడ్డి పేట గ్రామానికి చెందిన గొర్ల కాపరిగా గుర్తింపు.
గొర్లు కాస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు నేలపై ఉండడంతో అటుగా వెళ్లిన గొర్రెలను మలిపే ప్రయత్నంలో ఇటుక బట్టీలో నిర్లక్ష్యంగా కిందికి ఉన్న విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై మల్లేష్ సంఘటన స్థలానికి చేరుకున్న వివరాలు సేకరిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

