అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

పెద్దపల్లి మండలం కాపుల పల్లి గ్రామంలో అంజనీపుత్ర మహిళా సంఘ సభ్యులు మహిళా సమాఖ్య ద్వారా రుణాలు పొంది తిరిగి చెల్లించే డబ్బుల లో లక్షా 50 వేల రూపాయలు అవకతవకలు జరిగాయని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేయగా స్పందించిన అధికారులు మంగళవారం రోజున కాపుల పల్లి గ్రామంలో విచారణ చేపట్టారు గ్రామంలోని మహిళ సంఘలా గ్రూపు సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టారు.

ఒక కాపుల పల్లి గ్రామం లోనే కాకుండా మండలంలోని అన్ని గ్రామాల మహిళా సంఘ గ్రూపుల పైన సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచాలని పలువురు కోరుతున్నారు