పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: సోమవారం రోజు పెద్దపల్లి ట్రాఫిక్  సీఐ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు పెద్దపల్లి  ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ తన సిబ్బందితో కలిసి స్థానిక      బస్టాండ్ ఆవరణలో మరియు  బస్సులలో ప్రయాణిస్తున్న ,ప్రయాణికులకు కరోన పైన  అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో మళ్లీ కరోనా ప్రబలుతున్న దృష్ట్యా, ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్ వాడాలని సూచించారు. బస్సులో ప్రయాణిస్తున్న  మాస్క్ ధరించిన వారికి  మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా  ట్రాఫిక్ సిబ్బంది చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని ప్రయాణికులు అభినందించారు.       ద్విచక్ర  వాహణదారులకు చాలన్స్ పైన అవగాహన కల్పిస్తున్న దృశ్యం.

పెద్దపల్లి పట్టణంలో ఈరోజు సాయంత్రం ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ ఆధ్వర్యంలో జెండాకు కూడలి, కమాన్,HDFC బ్యాంకు వద్ద  వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ద్విచక్ర వాహనాల పైన ఉన్నటువంటి పెండింగ్ చలాన్ లను ప్రయాణికుల చేత చెల్లింపు చేయించారు. వాహనాల పైన ఉన్నటువంటి  పెండింగ్ చాలన్స్  వెంటనే చెల్లించాలని ప్రయాణికులకు సూచించారు డ్రైవింగ్ లైసెన్స్ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉండి హెల్మెట్ ధరించి మద్యం తాగకుండా రహదారి భద్రతలు పాటిస్తూ వాహనాలు నడపాలి సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కార్తీక్ పాల్గొన్నారు. ద్విచక్ర వాహణదారునికి  బ్రీతింగ్ పరీక్ష నిర్వహిస్తున్న   ఎస్ ఐ ఇసాక్