గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత ఆత్మహత్య పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రొంపికుంట
గ్రామానికి చెందిన గుమ్మడి ఉమా గత 15 రోజుల క్రితం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో సిజేరియన్ కావడం ద్వారా కుట్లు వేశారు. కుట్లు మానకపోవడంతో మళ్లీ కుట్లు వేశారు . రెండోసారి కూడా వేసిన కుట్లుఅతకక పోవడంతో ఆదివారం మరోమారు కుట్లు వేయాలని ఆస్పత్రి సిబ్బంది తెలపడంతో నొప్పి భరించలేక ఈరోజు తెల్లవారుజామున గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డo జరిగింది. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణంలో కుటుంబ సభ్యులు ధర్నా
