గోదావరిఖని అగ్నిధార న్యూస్ ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలో జరిగిన తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ గౌరవ సలహాదారుగా ఎన్నికైన  కె స్వామిని గోదావరిఖనిలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ ఆవుల రాజేష్ యాదవ్ మరియు తోటి రిపోర్టర్లు మిత్రబృందం కలిసి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆవుల రాజేష్ యాదవ్ మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి మహోన్నతమైనది ఈ వృత్తిలో రాణించాలంటే ప్రజా సమస్యలు వెలికి తీయాలి అనే ఆసక్తి నిబద్ధత క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. అలాంటి లక్షణాలు మిత్రులు కే స్వామి వద్ద పుష్కలంగా ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులను చేపట్టాలని  ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలోబండారిశ్రీనివాస్, మెండ,లింగయ్యయాదవ్,కే.రవీందర్,అంజి , శ్రీనివాస్ రెడ్డి , తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.