ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ.
పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి పలు వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి వెంటనే, సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్ కు వస్తున్న దరఖాస్తుల పురోగతిపై కలెక్టరేట్ సిబ్బంది , దరఖాస్తులకు నెంబర్ కేటాయించి పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
