పెద్దపల్లి అగ్నిధార న్యూస్ జిల్లాలోని రైస్ మిల్లర్లమంతా కలిసికట్టుగా ఉంటామనిరైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం సభ్యులు ఇల్లందుల కృష్ణమూర్తి, కంది చొక్కారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం భవనంలో సోమవారం రా రైస్ మిల్లర్ల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సంఘంలో నెలకొన్న చిన్న చిన్న వివాదాల వల్ల రెండుగా చీలి మరో సంఘం ప్రధాన కార్యదర్శిగా చొక్కారెడ్డి నియమించబడ్డారు.రెండు సంఘాల వల్ల తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒకే సంఘం కింద పనిచేయడానికి మెజారిటీ సభ్యులు తీర్మానించినట్లు తెలిపారు.గతంలో కొన్ని మిల్లులకు బియ్యం కోటా అందలేదని అలాంటి సమస్యలు తలెత్తకుండా కలిసికట్టుగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఎండి సజ్జు, యాంసాని వేణు,కాసనగొట్టు శ్రీనివాస్, తిరుపతి,అంజన్ రావు, లింగారెడ్డి, భాస్కర్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
