పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ జిల్లాలో ఒకటో తారీకు నుండి  18వ తారీకు వరకు పిడిఎఫ్ బియ్యం దొంగలకు పండగే ఈ తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షేమం దృశ్య ప్రభుత్వం పేదవారికి బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది ఈ సమయాన్ని బియ్యం దొంగలు తమకు అనువైన సమయంగా మార్చుకొని రేషన్ షాప్ వద్ద నుండి బియ్యం తీసుకువచ్చిన లబ్ధిదారుల నుండి ఇల్లిల్లూ తిరుగుతూ అతి తక్కువ ధరకు 7 లేదా 8 రూపాయలకు కిలో బియ్యం చొప్పున బియ్యాన్ని కొనుక్కొని అక్రమ నిల్వలు చేసుకుంటూ పక్కనున్న మహారాష్ట్ర కి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బియ్యం దొంగని పట్టుకొని  అరెస్టు చూపారు. వివరాలు

నిల్వ చేసి ఉంచిన 50 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న రామగుండo టాస్క్ ఫోర్సు పోలీసులు.      బుధవారం రోజు టాస్క్ ఫోర్సు సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్సు పోలీసులు కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మొట్లపల్లి గ్రామం కోమల సమ్మయ్య ఇంట్లో ప్రభుత్వ పిడిఎస్ రైస్ నిల్వ ఉంచాడు ,అనే నమ్మదగిన సమాచారం మేరకు అతని ఇంటిలో తనిఖీ నిర్వహించగా సంచులలో నింపి ఉన్న పిడియస్ రైస్ గుర్తించడం జరిగింది. అట్టి బియ్యం స్వాధీన పరుచుకొని నిందితున్ని అదుపులోకి తీసుకొని. విచారణ నిమిత్తం కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ వారికీ నిందితుడిని అప్పగించడం జరిగింది. పట్టుబడిన నిందితుల వివరాలు.1కోమల సమ్మయ్య s/o మల్లయ్య,40yrs, తెనుగు, మొట్లపల్లి.                                                                                                            .   స్వాధీ పరుచుకున్న వాటి వివరములు

పిడిఎస్ రైస్ 50 క్వింటాళ్ళు వాటి విలువ సుమారు రూపాయలు : 75,000=00,

ఈ టాస్క్ లో  చంద్రశేఖర్, రవి పాల్గొన్నారు.