అగ్నిధారన్యూస్ ( జగిత్యాల ):తెలంగాణ ప్రభుత్వం అస్తవ్యస్త విద్యావ్యవస్థ పనితీరుపై Trsప్రభుత్వంపై నిప్పులు చెరిగిన పట్టభద్రులMLC జీవన్ రెడ్డి స్థానిక జగిత్యాల(ఇందిరా భవన్)లో MLC జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ. విద్యావ్యవస్థపై trs ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ,అసలు విద్యావ్యవస్థ ఎలా పనిచేయలో తెలియని ప్రభుత్వాన్ని చూస్తే జాలివేస్తుందని.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన భోదించాలంటే ముందు పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు నెలకొల్పాలి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడు ఏండ్ల నుంచి 6నెలల కొకసారి నిర్వహించవలసిన టెట్ ను నిర్వహించని అసమర్థత ప్రభుత్వమని హెద్దేవా చేశారు.తెలంగాణలో అధికారికంగా ఇరవై వేల ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నవని వాటిని భర్తీ చేయకుండా ఇంగ్లీష్ మాధ్యమంలో ఎలా భోదిస్తారని,ఇంగ్లీష్ బోధన చేయాలంటే పిల్లల సంఖ్య పరంగా కాకుండా తరగతి గదుల పరంగా విద్యాబోధన ఉండాలి.ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఇంగ్లీషు బోధన సమానంగా నడవాలంటే వాటికి కావలసిన మౌలిక సదుపాయాలు నెలకొల్పాలి.ఇవన్నీ చేయకుండా ఇంగ్లీషు మాధ్యమం సాధ్యపడదు.గత 7 ఏండ్ల నుంచి టెట్ నిర్వహించని రాష్ర్టం దేశంలో ఏదయినా ఉన్నదంటే అది తెలంగాణ మాత్రమే. గతంలోనే తెలంగాణలో ఇంగ్లీషు మాధ్యమం ఏర్పాటు చేయాలని తిరుపతి రావు కమిటీ వేశారు.అది ఏమయింది.మళ్ళీ ఇంగ్లీషు మాధ్యమని కొత్త కమిటీ వేసి ఎవర్ని మోసం చేయాలని చూస్తున్నారని,ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే వారంతా పేదవారేనని వారిని చదువుకు దూరం చేయడం మీకు మంచిదికాదని, ఆఖరికి మిడ్డే మిల్స్ వర్కర్స్ సమ్మె చేస్తుంటే వారి సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వానికి మిడ్డే మిల్స్ రూపాయలుమిగులుతున్నాయని,సంబరపడుతున్నారని చురకలు అంటించారు.ఆఖరుకు 5 ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చిన Trs ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన మహిళా యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఏమయింది.ప్రైవేటు యూనివర్సిటీలతో పేదలకు ఎలా మేలుజరుతుందని తెలియని ప్రభుత్వాన్ని చేస్తే జాలేస్తుందని,317 జీవో తీసుకువచ్చి ఉద్యోగుల జీవితాలను పణంగా పెట్టాడని.317 జీవో వల్ల భార్య,భర్త,పిల్లలను విడదీసిన పాపం తప్పకుండా Trs ప్రభుత్వంకు తగులుతుందని,పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి పిలగాడయిన విద్య,వైద్యం పై చట్టం చేసాడని ఆ పిలగాడికి చూసైనా బుద్ది తెచ్చుకోవాలని హితవుపలికారు.రోజురోజుకు మీ ప్రభుత్వంపై ప్రజలు నిరాసక్తత కలిగిఉన్నారని గమనించి ఓటు రాజకీయం కోసం నాటకాలు ఆపాలని, సుదీర్ఘమైన నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గమయిన పాలన చూడలేదని,ధనిక రాష్ట్రామయిన తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్టంగా మిగిలిందని, ఇటువంటి పాలనచూసి అప్పుడప్పుడు అనిపిస్తుంది కాంగ్రేస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేశామని ఆవేదన చెందిన MLC జీవన్ రెడ్డి .ఇట్టి ప్రెస్ మీట్ లో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు కొత్త మోహన్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ శంకర్ ,కండ్లపెల్లి దుర్గయ్య కొండ్ర జగన్ ,గాజుల రాజేందర్ ,పులి రాము ,తదితరులు పాల్గొన్నారు.
