అగ్నిధారన్యూస్( జగిత్యాల ):కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన రాచర్ల స్వరూపరాణి గ్రేడ్ 2 అంగన్వాడి సూపర్వైజర్ పోటీ పరీక్షలలో రాష్ట్ర స్థాయి లో 24 వ ర్యాంక్ సాధించగా బుధవారం రోజున సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు స్వరూప రాణి ని శాలువాతో సన్మానించి మరింత మెరుగైన సేవలను అందించి మండలానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు పర్లపల్లి ప్రసాద్, MPTC సామల లక్ష్మణ్, కో ఆప్షన్ సభ్యులు నసీరొద్దీన్, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, తెరాస మండల ప్రధాన కార్యదర్శి చెన్నమనేని వేణురావ్, నాయకులు సరిపెల్లి రత్నాకర్,కొలాపురం రమేష్, మహంకాళి గంగరాజం,కాయిత రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు
