అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్ 19 అనే డిగ్రీ చదువుతున్న విద్యార్థి వెన్నంపల్లి శివారులోని ఓ రైతు వ్యవసాయ భూమిలో అనుమాన స్పదంగా మృతి చెంది ఉండడం కలకలం సృష్టించింది. ఈ నెల 18 సాయంత్రం అదే గ్రామానికి చెందిన నూనే అనీల్, నూనే శివలు ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పగా,తరుణ్ వెళ్లి ఇంటికి రాకపోవడంతో తరుణ్ కోసం కుటుంబ సభ్యులు కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి, తదితర గ్రామాల్లో తిరుగగా ఎక్కడ కనిపించకపోవడంతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం దామ తరుణ్ వెన్నపల్లి శివారులో ఓ రైతు వ్యవసాయ భూమిలో శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు పలు,అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
