అగ్నిధారన్యూస్:ఓకే గ్రేడులో అండర్ గ్రౌండ్ లో ఏడు సంవత్సరాలు, సర్ఫేస్ లో ఎనిమిది సంవత్సరాలు ఉన్న కార్మికుడికి రావాల్సిన సర్వీస్ లింకు ప్రమోషన్ (ఎస్.ఎల్.పి-SLP) సింగరేణిలో వెంటనే అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు.సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పదో వేతన ఒప్పందం లో అగ్రిమెంట్ ప్రకారం కోల్ ఇండియాలో దానిని అమలు చేస్తున్నారని 11వ వేతన ఒప్పందం లో ఎలాంటి ఒప్పందం జరిగినా ఆ ఒప్పందానికి లోబడి ఎస్.ఎల్.పి ని సవరించే విధంగా కోల్ ఇండియా యజమాన్యం ఇచ్చిన ఆదేశాల కు లోబడి ఈసీఎల్ లాంటి అనేక కోల్ ఇండియా అనుబంధ సంస్థలు ఎస్.ఎల్.పి ని అమలు చేస్తున్నారని అలాంటి దానిని సింగరేణి లో అమలు చేయకుండా నిలుపుదల చేయడం ఎంత వరకు సమంజసమని దానిని వెంటనే సింగరేణిలో అమలు చేయాలని దానిని అమలు చేయకపోవడం వల్ల 01.01.2022 నుండి దిగిపోయిన కార్మికులకు తో పాటు పనిచేస్తున్న వారికి కూడా అనేక రకాల ప్రయోజనాలు నష్టపోతారని కావున ఎస్.ఎల్.పి ని వెంటనే సింగరేణిలో అర్హత ఉన్న కార్మికులందరికీ ప్రమోషన్ ఆర్డర్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.