వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంద రాజేందర్ డిమాండ్.
అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ): కాల్వశ్రీరాంపూర్ ఉపాధి హామీ కూలీలకు 2 లక్షల బడ్జెట్టు కేటాయించాలని సి ఐ టి యు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంద రాజేందర్ డిమాండ్ చేశారు.

శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుందని అందుకు నిదర్శనం బడ్జెట్లో 73 కోట్లు కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒక మనిషికి ఈ సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు.