పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతికి వినతి పత్రం ఇస్తున్న పంచాయతీ కార్యదర్శులు.  

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి )రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రోజు జూనియర్ పంచాయతీ అధికారులు ఆయా మండల పరిధిలోని ఎంపీడీఓలకు ఎంపీపీ లకు జడ్పిటిసి లకు 12 4 20 22 తో మూడు సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి అవుతున్న సందర్భంగా ప్రస్తుతమున్న కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శి వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తూ ప్రస్తుతం ఉన్న ఓ పి ఎస్ లను మరియు జెపిఎస్ ల తో పాటు రెగ్యులర్ చేయాలని కోరారు. అదేవిధంగా జీవో నెంబర్ 26 15 7 2021 రద్దు చేసి మా యొక్క ప్రొబేషనరీ పీరియడ్ కాలము మూడు సంవత్సరాలకు పరిమితం చేస్తూ రెగ్యులర్ చేయాలని కోరారు. జిల్లా ప్రెసిడెంట్ సంతోష్ ,పరుశురాం, భానుప్రసాద్ ,సునీత సోనియా, మహేందర్ ,వేణుగోపాల్, రామ్ కిషోర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపెల్లి జడ్పిటిసి బండారి రామ్మూర్తి మరియు  ఎంపిఓ సుదర్శన్ లకు ,వినతి పత్రం అందిస్తున్న పంచాయతీ కార్యదర్శులు.